INSTALL DEMO
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 6:28 pm Posted by : MANA TOLIVELUGU

కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు వెలువరించిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు చెంపపెట్టు – మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

మన తొలివెలుగు, ప్రతినిధి ముత్తయ్య 

కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు వెలువరించిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు చెంపపెట్టు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును చట్టబద్ధతను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు సహా అధికారులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు ధర్మాసనం బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. హైకోర్టు చట్టబద్దమేనని తేల్చింది. అయితే ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా పిటిషనర్లపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. హైకోర్టు తీర్పుతో కేసీఆర్, హరీష్ రావ్ కు ఊరట కలిగింది. కేసీఆర్ ఎలాంటి తప్పు చేయలేదని న్యాయస్థానం విశ్వసించడంతో, తమ నమ్మకం మరింత బలపడిందని మాజీ మంత్రి  ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి , మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. తీర్పు చెప్పిన హైకోర్టుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో కొన్ని ప్రభుత్వాలు అధికారం అహంకారంతో వ్యవహరిస్తూ, రాజకీయ ప్రతీకారంతో కేసులు పెడుతున్న ఈ పరిస్థితుల్లో, ఈ తీర్పు వారికి ఒక గట్టి హెచ్చరికగా నిలుస్తుందన్నారు. కేసీఆర్ ఎలాంటి తప్పు చేయలేదని న్యాయస్థానం విశ్వసించడంతో, తమ నమ్మకం మరింత బలపడిందన్నారు. నిజానికి, తెలంగాణ ప్రజలు కూడా ఇదే విషయాన్ని చాలా కాలం క్రితమే అర్థం చేసుకున్నారు. రాజకీయ లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టినప్పటికీ, కేసీఆర్ తప్పు చేశారని ఎప్పుడూ ప్రజలు నమ్మలేదన్నారు. ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని ఆరోపణలు చేసినా, కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాల కోసం కట్టుబడి పనిచేసే నాయకుడని అందరికీ తెలుసు. ముఖ్యంగా రైతుల సంక్షేమం కోసం ఆయన చూపిన శ్రద్ధ ఎంతో విశేషమైనది అన్నారు. ఏ సమావేశం జరిగినా, రైతుల సమస్యలపై గంటల తరబడి చర్చించేవారని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఈ ప్రాంతంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ రాష్ట్రం ఏర్పడి, కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ అభివృద్ధి కొత్త దిశలో సాగిందన్నారు. ఇది ప్రతి రంగంలో స్పష్టంగా కనిపిస్తుందన్నారు.

ప్రత్యేకంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్పుకోవాలి. కాళేశ్వరం సాధారణ ప్రాజెక్టు కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులలో ఒకటన్నారు. అనేక బ్యారేజీలు, రిజర్వాయర్లు, సొరంగ మార్గాలు, కాలువలు కలిపి నిర్మించిన మహత్తర ప్రాజెక్టు అని తెలిపారు. రైతులకు నీటిని అందించాలనే సంకల్పంతో దీనిని పూర్తి చేశారన్నారు

ఈ ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తూ, లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం సరైంది కాదు. వాస్తవానికి ఇది ఎంతో పెద్ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు, దాని విస్తీర్ణం, నిర్మాణం, ప్రయోజనాలు చూసినప్పుడు ఖర్చులు సహజంగానే అధికంగా ఉంటాయన్నారు.

ఇప్పటి ప్రభుత్వం ఈ ప్రాజెక్టులపై విమర్శలు చేయడం కన్నా, వాటిని సద్వినియోగం చేసుకుని రైతులకు మరింత మేలు చేయడంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. కాలేశ్వరం పై తప్పుడు ప్రచారాల్ని ప్రజలు గమనిస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలోనే బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బడంగ్పేట్, మీర్పేట్ బీఆర్ఎస్ అధ్యక్షులు రామిడీ రామిరెడ్డి ,అర్కల కామేష్ రెడ్డి, సీనియర్ నాయకులు భూపాల్ రెడ్డి, ఎనుగుల అనిల్ కుమార్ యాదవ్, దీప్లాల్ చౌహాన్, బాలరాజు, మహిళా నాయకురాళ్ళు సునీత, గీత తదితరులు పాల్గొన్నారు.