INSTALL DEMO
Newspaper Banner
Date of Publish : 26 April 2026, 1:10 pm Posted by : MANA TOLIVELUGU

జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో రోడ్డు విస్తరణ పనులు – ఆక్రమణల తొలగింపు ప్రక్రియ వేగవంతం

మన తొలివెలుగు: చాంద్రాయణగుట్ట ప్రతినిధి శైలేష్ కుమార్ 

ఛత్రినక చౌరస్తా రోడ్డు విస్తరణ, ట్రాఫిక్ రద్దీ నివారణలో భాగంగా జీహెచ్‌ఎంసీ అధికారులు ఆక్రమణల తొలగింపు ప్రక్రియను చేపట్టారు. నగరంలోని ఓల్డ్ సిటీ ఛత్రినక పాత పోలీస్ స్టేషన్ చౌరస్తా నుండి బోయిగూడ, కందికల్ గేట్ సమీపంలో ఫుట్‌పాత్‌పై ఉన్న అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో హైడ్రా, మరియు పోలీస్ అధికారులు, బల్దియా సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో జేసీబీ సహాయంతో అక్రమణాల తొలగింపు పనులు చేపట్టారు. రోడ్డును అక్రమించి నిర్మించిన మెట్లు, ప్లాట్‌ఫామ్‌లను, షేడ్లను తొలగించడంతో రోడ్డు మరింత వెడల్పు కానుంది. దీంతో వాహనదారులకు, పాదచారులకు ఇబ్బందులు తొలగనున్నాయి.

ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ అధికారులు మాట్లాడుతూ.. నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నామని, ముందస్తు నోటీసులు ఇళ్ల యజమానులకు, దుకాణం నడుపుతున్నవారికి, ఇచ్చిన తర్వాతే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అందులో కొంత మంది, ఇళ్ల డాక్యుమెంట్స్ ప్రకారం సెట్ బ్యాక్ కి ప్రజలు సహకరించాలని కోరారు. శిథిలాలను త్వరలోనే తొలగించి రోడ్డు మరమత్ పనులు చేపడతామని అధికారులు తెలిపారు.