INSTALL DEMO
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 9:04 pm Posted by : MANA TOLIVELUGU

జేఈఈ మెయిన్స్ ఫలితాలలో విజయ దుందుభి మోగించిన వాగ్దేవి కళాశాల విద్యార్థులు 

మన తొలివెలుగు, మీరు ప్రతినిధి ముత్తయ్య 

ఇంటర్మిడియేట్ పరీక్ష ఫలితాలలోనే కాదు జేఈఈ మెయిన్స్ ఫలితాలలో కూడా వాగ్దేవి కళాశాల విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్ చౌరస్తాలో ఉన్న శ్రీ వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు పరీక్షలు ఏవైనా ఫలితాలలో మాత్రం టాప్ ప్లేస్ నిలుస్తున్నారు. వారం క్రితం విడుదల అయిన ఇంటర్మిడియేట్ పరీక్ష ఫలితాలలో నే కాదు మంగళవారం విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాలలో కూడా విజయ దుందుభి మోగించారు. దినేష్ ఆల్ ఇండియా ర్యాంక్ 793 , కిషోర్ 1612 ర్యాంక్ , శ్రీరామ్ 3916 ర్యాంక్ , కృష్ణ 5572 ర్యాంక్ లు సాధించి బాలాపూర్ పట్టణ పరిసర ప్రాంతాలలో తిరుగులేని కాలేజీ శ్రీ వాగ్దేవి జూనియర్ కాలేజీ గా మరోసారి నిరూపించారు. అంతే కాకుండా 90% పైన 16 మంది విద్యార్థులు 32 మంది విద్యార్థులు అడ్వాన్స్ ఎగ్జామ్ కి క్వాలిఫై అయి సత్తా చాటారు. ఈ సందర్బంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు , తల్లితండ్రులకు కళాశాల చైర్మన్ శ్రీ సిద్ధాల బీరప్ప , వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు పోలోజు రవి కుమార్ , తిపర్తి నరసింహా రెడ్డి ఈ కార్యక్రమం లో పాల్గొని విద్యార్థులను అభినందించారు.