INSTALL DEMO
Newspaper Banner
Date of Publish : 26 April 2026, 10:42 am Posted by : MANA TOLIVELUGU

బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ని అవహేళనగా మాట్లాడితే కవితైనా మరి ఎవరైనా ఊరుకునేది లేదు – తగిన బుద్ధి చెప్తాం

మన తొలివెలుగు , మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

తెలంగాణా ప్రజలను తన మోసకారి చేష్టలతో
అతి తెలివితో దుర్మార్గ రాజకీయాలకు దిగి
చిల్లర బద్నాంలు చిల్లర మాటలు మాట్లాడే
ఎవరైనా ఊరుకునేది లేదని.. తగిన బుద్ధి చెప్తామని రాజేంద్రనగర్ మహేశ్వరం సోషల్ మీడియా వారియర్లు కాట్రగడ్డ వాసు బాబు, కాడమోని ప్రభాకర్, మహేందర్ ముదిరాజ్ లు హెచ్చరించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలంగాణ జాగృతి సంస్థను టీఆర్ఎస్ పార్టీగా మార్చి తెలంగాణ ఉద్యమకారుడిని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన మాజీ సీఎం కేసీఆర్ ని అవహేళన చేసిన సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేసీఆర్ ని టార్గెట్ చేసి అవహేళన చేస్తుంటే.. దూషణలు చేస్తూ, తన స్వార్థ పదవుల కోసం అధికారం కోసం తెలంగాణా ద్రోహ పార్టీలతో అంతర్గత ఒప్పందం చేసుకుని తెలంగాణా ప్రజలను తన మోసకారి చేష్టలతో, అతి తెలివితో, దుర్మార్గ రాజకీయాలకు దిగి చిల్లర బద్నాంలు చిల్లర మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. బయటి శత్రువు కన్నా ఇంటి దొంగనే చాలా ప్రమాదకరమన్నారు.
కవిత ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఎన్నో ప్రయోజనాలునాలను, పదవులను పొంది అవినీతి ఆరోపణల్లో కూరుకపోయిన కవిత, ఓ అవినీతి మరక అని తెలిపారు. తప్పకుండా మనకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సర్వస్వం అన్నారు. బీఆర్ఎస్ పార్టీని కానీ కేసీఆర్ ని  కానీ
కవితైనా, ఇంకెవరైనా..అసభ్య పదజాలంతో, అవహేళన చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఆమె రాజకీయాలు అంటే చిల్లర చేష్టలు డ్రామాలు చేయడం అనుకొంటుందని పేర్కొన్నారు. లిట్రల్ గా కన్న తండ్రిని, సోదరుడిని, తన ఇతర కుటుంబ సభ్యులను బ్లాక్ మెయిల్ చేసి.. వారిని ప్రజల్లో చులకన చేసి.. ఈమె నాయకురాలిగా ఎదగాలనే ఓ దరిద్రపు ఆలోచనలు చేస్తోందన్నారు. అయితే ఆమె వెనుక కొన్ని దుష్ట శక్తులు చేరి.. ఆమెను పూర్తిగా ఓ దుర్మార్గురాలిగా మార్చారన్నారు. అంటే గంగ, చంద్రముఖి లాగా మారిపోయిందనీ, ఆమె ఆలోచన మొత్తం దురాశ, అధికారం, పదవులు దోపిడీ అనే పదాల్లో నిక్షిప్తమై ఉందన్నారు. కుట్రలు కుతంత్రాలు, అనైతిక రాజకీయాలకు దిగిందన్నారు. ఆమెకు అర్థం అయింది కేసీఆర్ ని ఎదుర్కోవడం సులువు కాదని.. ఆమె బీజెపీ , కాంగ్రెస్ పార్టీ లకు మేలు చేయడానికి ఈ డ్రామాలు ఆడుతున్నారన్నారు.