INSTALL DEMO
Newspaper Banner
Date of Publish : 24 April 2026, 7:21 pm Posted by : MANA TOLIVELUGU

మహేశ్వరం మండల్ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన శ్రీరాములు అందెల

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య 

ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇంచార్జ్ అందెల శ్రీరాములు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ గత రెండు రోజులుగా కొనసాగిస్తున్న సమ్మెలో భాగంగా శుక్రవారం మహేశ్వరం మండలం ఆర్టీసీ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మెకు మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇంచార్జ్ అందెల శ్రీరాములు మహేశ్వరం మండల కేంద్రం బస్ డిపోకు చేరుకొని ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నిలిచారు. అనంతరం శ్రీరాములు ఆర్టీసీ కార్మికులతో కలిసి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణంగా కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని…ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే ప్రజా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు…కావున ప్రభుత్వం ఆలస్యం చేయకుండా తక్షణ చర్యలు తీసుకుని ఆర్టీసీ కార్మికుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి అని….వారు కోరిన న్యాయమైన డిమాండ్లను వెంటనే తీర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు టి యాదిష్ , జాతీయ కిసాన్ మోర్చా నాయకులు పాపయ్య గౌడ్, జిల్లా నాయకులు మిద్దె సుదర్శన్ రెడ్డి , పార్లమెంట్ కో-కన్వీనర్ అనంతయ్య గౌడ్ , బీజేపీ రాష్ట్ర నాయకులు కడారి జంగయ్య యాదవ్, పోతర్ల సుదర్శన్ యాదవ్, బీజేపీ సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, రుద్ర నాగరాజ్, గిరిజన మూర్ఛ రాష్ట్ర నాయకులు దేశ్యా నాయక్, మండల ప్రధాన కార్యదర్శి వనంపల్లి శ్రవణ్, ఉపాధ్యక్షులు నేనావత్ రూప్ సింగ్, కాసాని ఆనంద్ గౌడ్, కంది శీను, మోర్చా అధ్యక్షులు పాండు, రఘువీర్, సర్పంచ్ కృష్ణ యాదవ్, మాజీ సర్పంచ్ సురేష్, పాండు నాయక్, చిన్నం జంగయ్య, మహేందర్, సందుల గణేష్, లోకేష్ చంద్రకాంత్, వెంకట్, మాజీ కౌన్సిలర్లు కాంటెకర్ మధుమోహన్, రాజమోని రాజు ముదిరాజ్, జపాల సుధాకర్, బాకీ విలాస్, శ్రీను, రవి నాయక్, ముఖేష్ ముదిరాజ్, సిద్దాల శ్రీనివాస్, నితిన్ రెడ్డి, జెడి పవన్, ఎమ్మార్పీఎస్ నాయకులు, వివిధ మోర్చాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.