వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి – మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ప్రారంభోత్సవం వాసవీ మాతను ఆదిపరాశక్తి స్వరూపంగా భక్తులు కొలుస్తారు మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, చల్లగా ఉండాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్ పేట్ డివిజన్ పరిధిలోని జిల్లెలగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సమీపంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ చైర్మన్ తేరటిపల్లి శ్రీనివాస్ గుప్తా, అధ్యక్షుడు పచ్చిపులుసు శ్రీరామచంద్రమూర్తి గుప్తా, ప్రధాన...