విజయ్ చరిత్ర సృష్టిస్తాడా, చతికిలబడతాడా..?
సీనియర్ జర్నలిస్ట్ శ్రావణ్ బాబు తమిళనాడు రాజకీయాలపై విశ్లేషణ చేస్తూ.. మీ కోసం అందిస్తున్న ప్రత్యేక కథనం.. విజయ్ ను ఒక విషయంలో మెచ్చుకోవాలి. రజనీకాంత్ చేయలేకపోయిన రాజకీయరంగ ప్రవేశమనే సాహసాన్ని చేసినందుకు. రాజకీయాలలో ప్రవేశించటమే కాదు, బీజేపీ, కాంగ్రెస్, అన్నాడీఎంకే వంటి ఎన్నిపార్టీలు పొత్తు పెట్టుకుందామన్నా, నిరాకరించి ముఖ్యమంత్రి కావటమే లక్ష్యంగా ఒంటరిగా ఎన్నికల బరిలోకి దూకారు. మరి అతను ఈ ఎన్నికల తర్వాత కింగ్ అవుతాడా, కింగ్ మేకర్ అవుతాడా, అసలు అతని ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనేది పరిశీలిద్దాం....