మన తొలివెలుగు, మహేశ్వరం బ్యూరో ప్రతినిధి ముత్తయ్య
మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్‌పేట్ ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకుడు, స్థానిక అధ్యక్షుడు స్వర్గీయ రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద ఆయన చిత్రపటానికి మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, పలువురు నాయకులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. రామకృష్ణారెడ్డి తల్లిదండ్రులు, సతీమణి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రామకృష్ణారెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఆయన కుటుంబానికి ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, జంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.