మన తొలి వెలుగు, నాగర్ కర్నూల్ బ్యూరో ప్రతినిధి విజయ్ కాంత్
సమాజం మార్పుకు ఉపాధ్యాయులే కీలకమని కోడేరు మండల విద్యాధికారి భాస్కరరావు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గాడి సుగుణ కుమారి పదవి విరమణ అభినందన సభలో పాల్గొన్న మండల విద్యాధికారి భాస్కర్ రావు మాట్లాడుతూ.. సామాజిక మార్పుకు ఉపాధ్యాయులే కీలక పాత్ర అని అన్నారు. పదవి విరమణ ఉద్యోగంలో చివరి భాగం అని, ఆది వయస్సుకే తప్ప మనసుకు కాదని ఆపాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుధారాణి అన్నారు. గాడి సుగుణ కుమారి మాట్లాడుతూ.. నా 28 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఎంతో మంది ఉత్తమ విద్యార్థులను తయారు చేసిన తృప్తి జీవితంలో చాలా ఆనందాన్ని సంతృప్తిని మిగిల్చిందన్నారు. విద్యార్థులు సమాజంలో సేవా తత్పరతను కలిగి ఉండాలని ఆమె కోరారు. కృష్ణయ్య మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమని జీవితంలో ఉత్తమ శిష్యులకు మార్గదర్శమని అన్నారు. ఉపాధ్యాయులు రాఘవేందర్, ఖలీల్, రాజేష్, గోపాలకృష్ణ వెంకటస్వామి ,కుర్మయ్య సరళ, కవిత తదితరులు సుగుణ కుమారి సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు గాడి సురేందర్ సూర్య కళ, సుధాకర్, జ్యోత్స్న, దుర్గా ప్రసాద్, జస్వంత్, మిత్రులు శిష్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
