ePaper
Tuesday, April 28, 2026
ePaper
Homeతెలంగాణనాగర్‌కర్నూల్ఘనంగా తోటపల్లి సుబ్రహ్మణ్య శర్మ శత జయంతి వేడుక

ఘనంగా తోటపల్లి సుబ్రహ్మణ్య శర్మ శత జయంతి వేడుక

📰 Generate e-Paper Clip

ఉపాధ్యాయులు కే. గోపాలస్వామి పదవి విరమణ వేడుక

మన తొలివెలుగు, నాగర్ కర్నూల్ బ్యూరో ప్రతినిధి విజయ్ కాంత్ 

బిజినపల్లి మండలంలోని పాలెం గ్రామంలో తోటపల్లి సుబ్రమణ్యం మెమోరియల్ హైస్కూల్ (టీఎస్ఎం హెచ్ఎస్) లో గురువారం శ్రీ తోటపల్లి సుబ్రహ్మణ్యేశ్వర శర్మ జయంతి వేడుకలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు డ్రాయింగ్ మాస్టర్ కే.గోపాలస్వామి 40 సంవత్సరాల పాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి పదవి విరమణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏయిడెడ్ స్కూల్ కావడంతో ఒకే పాఠశాలలో 40 ఏండ్ల పాటు ఈ ప్రాంత విద్యార్థులకు డ్రాయింగ్ లో నైపుణ్యం నేర్పించడంతో ఎంతో మంది ఆర్టిస్టులుగా, సివిల్ ఇంజనీయర్ చదువుల్లో,ప్లానింగ్ డ్రాయింగ్ కు తోడ్పాటు అందించాయని కొనియాడారు. ఉపాధ్యాయుడిగానే కాకుండా ఆలయ అభివృద్ధిలో,  పాలెం గ్రామాభివృద్ధిలో చురుకుగా ఉన్న గోపాలస్వామి భవిష్యతులో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థుల సంఘం నేతలు ఆయనను శాలువాలు, మెమంటోలతో ఘనంగా సన్మానించారు, పాఠశాల విశ్రాంత ఉపాధ్యాయులు గాడి సురేందర్, కందాడై శ్రీనివాసచారి, మోహన్ బాబు, వెంకటేశ్వర్ రెడ్డి, జహిందర్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, మధు దయానందరావు, ఈశ్వరమ్మ, సునీత, యశోద, శివలీల, ప్రకాష్  బాబుజి, కుటుంబ సభ్యులు కే.రాధ, మంజీరా కళ్యాణ్ కుమార్, సింధూర రాజశేఖర్, డాక్టర్ సుప్రియ డాక్టర్ సూర్యనారాయణ, డాక్టర్ శ్రీ ప్రియ, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!