ePaper
Tuesday, April 28, 2026
ePaper
Homeయాదాద్రి భువనగిరి జిల్లాహైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు

హైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు

📰 Generate e-Paper Clip

హైకోర్టు తీర్పుతో బట్టబయలైన కాంగ్రెస్ చేసిన గోబెల్స్ ప్రచారం

భువనగిరిలో విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి

మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్ 

కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. గురువారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన వంద కాంపోనెంట్లలో రెండు పిల్లర్లు కుంగితే రూ.లక్ష కోట్లు కొట్టుకపోయాయంటూ కాంగ్రెస్ చేసిన గోబెల్స్ ప్రచారం హైకోర్టు తీర్పుతో బట్టబయలైందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురదచల్లి రాజకీయ లబ్ధి పొందాలనే దురుద్దేశంతో కాంగ్రెస్ ఇలా చేస్తున్నరన్నారు. తెలంగాణ ఉన్నంత కాలం కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటుందని, భూమిపై గోదావరి నది పారినంత కాలం ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన కేసీఆర్ పేరు నిలిచి ఉంటుందన్నారు. అభాండాలు, అబద్ధాలతో దుష్ప్రచారం చేసి, చిల్లర ప్రచారం చేస్తే రాష్ట్ర హైకోర్టు చెంపపెట్టు లాంటి తీర్పును ఇచ్చిందన్నారు. కేసీఆర్ పైన చేసిన కుట్రలు, కుతంత్రాలు కోర్టు తీర్పుతో కూలిపోయాయన్నారు. తెలంగాణ రైతులు, ప్రజలు విజయం సాధించారని పేర్కొన్నారు. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా మాజీ సీఎం కే. చంద్రశేఖర్రావు, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, మాజీ సీఎస్ శైలేంద్రకుమార్ జోషి, అప్పటి సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్పై పై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నివేదికలో పిటిషనర్లపై చేసిన ఆరోపణలు అర్థరహితమని పేర్కొందని ఆయన చెప్పారు. కమిషన్ పరిధి దాటి కొందరి ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసిందని ఆక్షేపించిందన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కాలేశ్వరంపై చేస్తున్న వాక్యాలు.. డ్రామాలన్నీ కోర్టు తెలిసిందన్నారు. ప్రెస్ మీట్ పెట్టి కేసిఆర్ దోషిగా ఉన్నారనడం దారుణం అన్నారు. కాలేశ్వరం మేడిగడ్డ లేకపోతే హైదరాబాద్ కు నీళ్లు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. ఈ జిల్లాలో ఎమ్మెల్యేలు కాలేశ్వరం నీళ్లను వాడుతున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహనం, ఆత్మస్థైర్యం కోల్పోతున్నారన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, పార్టీ నాయకులకు ధైర్యం ఉంటే రాజీనామాలు చేయాలని.. మళ్లీ ఎలక్షన్లకు పోదామన్నారు. కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయే పరిస్థితి వచ్చిందని, కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే మేము 10 ఏళ్ల వరకు పోటీ చేయమన్నారు. రైతుబంధు వేసిన ప్రతిసారి ప్రారంభోత్సవాలు చేస్తున్నారన్నారు. ప్రారంభోత్సవాలు చేయలేదని నేరుగా రైతుల ఖాతాలోకి రైతుబంధు డబ్బులు పడేయమన్నారు. బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పై చిల్లర భాష మాట్లాడడం మానుకోవాలన్నారు. మాజీ సీఎం కేసీఆర్ చేసిన కృషి వల్లే జిల్లాకు గోదావరి జిల్లాలను తీసుకురావడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఎమ్మెల్యేలు కాలేశ్వరం నీళ్లతో హంగామా చేస్తున్నారన్నారు. కుటుంబ పాలన కెసిఆర్ ది కాదని, మీ కాంగ్రెస్ పార్టీకి 400 మంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో భువనగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ పెంట నరసింహ, మాజీ ఎంపీపీ కేశవపట్నం రమేష్, మాజీ జెడ్పిటిసి బీరు మల్లయ్య, జిల్లా నాయకులు ర్యాకల శ్రీనివాస్, నాయకులు పెంట నితీష్, చెన్న మహేష్, శాగంటి నరసింహ, ఎండి. నయీమ్, గుజ్జ పవన్, అంజద్, శ్రీనివాస్, రత్నపురం పద్మ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!