మన తొలివెలుగు , మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా మంత్రి అజారుద్దీన్ ప్రొఫెసర్ కోదండరాం నియామకం అభినందనీయమని
మహేశ్వరం మండలం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి షేక్ హాజీ బాబా హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలు తెలంగాణ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు మహమ్మద్ అజరుద్దీన్. ప్రొఫెసర్ కోదండరాంల నియామకాన్ని ఆమోదం తెలిపిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల కి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనముల రేవంత్ రెడ్డి కి మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ తరఫున కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మహేశ్వరం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకానికి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆమోదం తెలిపారన్నారు. మంత్రి అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరామ్‌ల అభ్యర్థిత్వాలను ఖరారు చేస్తూ లోక్‌భవన్ నిర్ణయం తీసుకుందన్నారు. ఏప్రిల్ 30తో మంత్రి అజారుద్దీన్ ఆరు నెలల గడువు ముగియనున్న తరుణంలో.. ఈ నియామకం ఆయన పదవిని కాపాడిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా గవర్నర్‌ను కలిసి చేసిన విజ్ఞప్తి ఈ ప్రతిష్టంభనను తొలగించడంలో కీలక పాత్ర పోషించారన్నారు. గత ఏడాది ఆగస్టు 30న పంపిన ఈ ఫైల్ గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉండటంతో ప్రభుత్వంలో తీవ్ర ఉత్కంఠ నెలకొందన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా లోక్ భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో చర్చలు జరపడంతో అయోమయానికి తెరబడింది అన్నారు.
