ePaper
Monday, April 27, 2026
ePaper
Homeతెలంగాణరంగారెడ్డివిద్యుత్ అధికారులు ఉన్నారా ? ఉంటే ఎక్కడ పోయారు?

విద్యుత్ అధికారులు ఉన్నారా ? ఉంటే ఎక్కడ పోయారు?

📰 Generate e-Paper Clip

స్తంభాలు లేక కర్రలను ఆసరాగా చేసుకొని విద్యుత్ సరఫరా చేసుకుంటున్న ప్రజలు 

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

ప్రస్తుతం మనం ఏ కాలంలో ఉన్నాం. ఆధునిక కాలంలో ఉన్నామా? అనాగరిక కాలంలో ఉన్నామా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. హైదరాబాదు నగరానికి కూత వేటు దూరంలో ఉన్న శ్రీరామ కాలనీ పారిశ్రామిక వాడగా పేరు పొందింది. చిన్న పల్లెటూరు కాలనీ పట్నంగా మారింది. దినదిన అభివృద్ధి చెందుతుంది. అలాంటిది జల్ పల్లి డివిజన్ శ్రీరామ కాలనీలో కనీసం పార్కింగ్ చేసుకునే అవకాశం లేకుండా అస్తవ్యస్తంగా ఉన్న రహదారి, ఈ కాలనీలో విద్యుత్ స్తంభాలు లేవంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. అధికారులు స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులు ఇన్ని సంవత్సరాలు ఏమి చేశారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కాలనీలో స్తంభాలు సరిపోయినన్ని లేకపోవడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండ్ల కు, కర్రలను ఆసరగా చేసుకొని సర్వీస్ వైర్లను ఏర్పాటు చేసుకుని విద్యుత్ సరఫరాను చేసుకుంటున్నారు. జల్పల్లి డివిజన్ పరిధి శ్రీరామ కాలనీలోని కెనరా బ్యాంకు వెనుకాల పరిస్థితి ఇది. గత నాలుగు సంవత్సరాల క్రితం మున్సిపల్ అధికారులకు అస్తవ్యస్తంగా ఉన్న రహదారిని అభివృద్ధి చేయాలని, విద్యుత్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు కాలనీలో స్థంభాలు ఏర్పాటు చేయాలని పలుమార్లు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఎప్పుడు ఫిర్యాదు చేసిన త్వరలో విద్యుత్ స్థంభాలను ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్తున్నారు. కానీ ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడం లేదు. సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ఏర్పాటు చేయడం లేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ఈ కాలనీలో అరకొర విద్యుత్ స్థంభాల ఏర్పాటు వల్ల కాలనీ వాసులు అవస్థలు పడుతున్నారు. బిల్డింగ్ గోడలను, ఇంటి పైకప్పు రేలింగుకు, కర్రలను నాటి వాటిని ఆసరగా చేసుకొని సర్వీస్ వైర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. నాటిన కర్రలు పుచ్చుపట్టి విరగిపోయినప్పుడు గాని, గాలి దుమారానికి గాని కిందపడితే ప్రమాదం తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి విద్యుత్ స్తంభాలు, తీగలు ఏర్పాటు చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేకపోతే కాలనీ వాసులు అందరం కలిసి పెద్ద ఎత్తున మామిడిపల్లి సబ్ స్టేషన్ ముందు ధర్నా చేపడుతామని కాలనీ వాసులు హెచ్చరిస్తున్నారు.

మున్సిపల్, విద్యుత్ అధికారులు స్పందించడం లేదు..

సంవత్సరాలు దాటిన కూడ ఇంతవరకు రహదారిని అభివృద్ధి చేయలేదు. స్తంభాలను ఏర్పాటు చేయలేదు కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్రలను చేసుకొని సర్వీస్ వైర్లు ఏర్పాటు చేసుకున్నాము. అవి ఎండకు ఎండి, వానకు తడిసి సర్వీస్ వైర్లు తేలి ఒక వేళ షాట్సర్క్యూట్ అయితే ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకోస్తోందోనని కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు.

విద్యుత్ స్తంభాల ఏర్పాటు చేయాలని గత నాలుగు నెలల క్రితమే ఫిర్యాదు చేసాము – స్థానిక బీజేపీ నాయకుడు శాంత కుమార్ 

జల్ పల్లి డివిజన్ పరిధిలోని శ్రీరామ కాలనీ కెనరా బ్యాంక్ వెనకాల సింగానియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దారిలో సుమారు 50 నుంచి 70 ఇండ్లు ఉంటాయి. స్తంభాలు లేక ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ప్రధాన రహదారిపై ఉన్న స్తంభాల నుండి కర్రలను ఆసరాగా చేసుకుని ఏర్పాటు చేసుకున్నారు. స్తంభాలు ఏర్పాటు చేయాలని కాలనీ వాసులతో కలిసి తుక్కుగూడ విద్యుత్తు ఏడీ కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. 4 నెలలు గడుస్తున్నా కూడా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయలేదు. ఇప్పటికైనా త్వరగా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాను.

విద్యుత్ స్తంభాల ఏర్పాటు చేయిస్తా – మామిడిపల్లి ఏఈ సుమన్

క్షేత్రస్థాయిలో పర్యటించి ఎందుకు ఇంత వరకు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయలేదో తెలుసుకుంటాను. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉండి ఇళ్ళు నిర్మాణం చేసుకున్న వారికి ఆ కాలనీలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయిస్తాము.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!