ePaper
Tuesday, April 28, 2026
ePaper
Homeతెలంగాణరంగారెడ్డిగ్రామ గ్రామాన గులాబీ పార్టీని ఎదురులేని శక్తిగా తీర్చిదిద్దాలి

గ్రామ గ్రామాన గులాబీ పార్టీని ఎదురులేని శక్తిగా తీర్చిదిద్దాలి

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

గ్రామ గ్రామాన గులాబీ పార్టీని ఎదురులేని శక్తిగా తీర్చిదిద్దాలని రాజేంద్రనగర్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్, యువ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు. మహేశ్వరం మండల కేంద్రంలోని పి ఎస్ వై ఫంక్షన్ హాల్ లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కేసీఆర్ నాయకత్వంలోనే అన్ని రంగాలలో రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ నాయకులు పలు ముఖ్య కార్యకర్తల సమావేశాల్లో స్పష్టం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన కేసీఆర్ హయాంలోనే జరిగిందని, రాబోయే రోజుల్లో కూడా ఆయన నాయకత్వమే శ్రీరామరక్ష అని పార్టీ శ్రేణులు అభిప్రాయపడ్డారు . ముఖ్య అతిథిగా విచ్చేసిన కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, బడుగు, బలహీన వర్గాలకు పథకాలు అందాయని, పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడంలో కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను భారీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా తయారు చేశారన్నారు. రెండున్నర సంవత్సరాలుగా 365 రోజులు ప్రతిరోజు అప్పులు చేస్తున్నారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ప్రతి రోజు ఏదో ఒక అభివృద్ధి జరిగేదని, రోడ్లు డ్రైనేజీలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ఉండేవని, ప్రభుత్వానికి సంబంధించిన బిల్డింగులు నిర్మాణం చేసేవారని ప్రస్తుతం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందన్నారు. మళ్లీ భవిష్యత్తులో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే మహేశ్వరం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందన్నారు. రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో అన్ని స్థానాలను గెలిచే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. అనంతరం మహేశ్వర మండలంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కు మద్దతుగా వెళ్లి వారికి సంఘీభావం తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ చిత్రపటానికి కార్మికులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకమర్రి నరసింహ, మహేశ్వరం మండల సర్పంచ్ మునగపాటి నవీన్ గౌడ్, పి.ఏ.సి.ఎస్ వైస్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, సీనియర్ నాయకులు అంబయ్య యాదవ్, కర్రోళ్ళ చంద్రయ్య ముదిరాజ్, సుధీర్ గౌడ్, మోతిలాల్ నాయక్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!