ePaper
Tuesday, April 28, 2026
ePaper
Homeతెలంగాణరంగారెడ్డిసైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి.. లేకపోతే అంతే సంగతులు..!

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి.. లేకపోతే అంతే సంగతులు..!

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మహేశ్వరం బ్యూరో ప్రతినిధి ముత్తయ్య

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి.. లేకపోతే అంతే సంగతులు.. అని పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి, ఎస్పై లక్ష్మయ్య హెచ్చరించారు. పోలీస్ సిబ్బందితో కలిసి పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధి శ్రీ రామ్ కాలనీలో సైబర్ నేరాలపై సింగనియా ఫుడ్స్ కంపెనీ ఆవరణలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింఘానియా ఫుడ్స్ కంపెనీ కార్మికులు పాల్గొన్నారు. తాజా డిజిటల్ అరెస్ట్, లోన్ యాప్ మోసం, ఓటిపి మోసం, నకిలీ లింక్లు, మోసం కాల్లు, పాస్వర్డ్లను పంచుకోవడం, ఉద్యోగ మోసం గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుత సాంకేతిక యుగంలో టెక్నాలజీ జీవితాన్ని సులభతరం చేస్తున్నప్పటికీ, అదే సమయంలో సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ సాంకేతికత వినియోగంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, సైబర్ భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. సాంకేతికను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మనకు ఏదో లేనిపోని ఆశలు చూపించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు ఆయన తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీలు చెప్పాలని ఒత్తిడి తెస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి అన్నారు. డబ్బులు వస్తాయని ఓటీపీలు చెబితే అంతే సంగతులున్నారు. బ్యాంక్ ఖాతా ఖాళి అవుతుందన్నారు. సైబర్ నేరగాళ్లు రోజుకో రీతిలో ప్రజలను మోసం చేసి డబ్బులను కాజేస్తున్నారని వివరిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!